: అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష చెల్లదు: మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ నటరాజన్ జైలుకి వెళ్లిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమితుడైన పళనిస్వామికి కష్టాలు తప్పేలా లేవు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గిన నేపథ్యంలో ఆ పరీక్ష చెల్లదని మద్రాసు హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రతిపక్ష డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం రేపు దానిపై విచారణ జరపనున్నట్లు పేర్కొంది. దీంతో తమిళనాట మరోసారి ఉత్కంఠ మొదలైంది.