: అమ్ముడు పోని ఇషాంత్ శర్మ... తైమల్ మిల్స్ కు రూ. 12 కోట్లు


బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ వేలం పాటలో భారత పేసర్ ఇషాంత్ శర్మ ఆశ్చర్యకరంగా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచిడు. ఇషాంత్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇక ఇదే సమయంలో రూ. 10 కోట్లకు పైగా ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ తో పాటు తైమల్ మిల్స్ కూడా చేరాడు. మిల్స్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతన్ని సొంతం చేసుకునేందుకు అన్ని జట్లూ పోటీ పడటంతో ధర పెరుగుతూ పోయింది. మరో విదేశీ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ను కోల్ కతా ఫ్రాంచైజీ రూ. 5 కోట్లు పెట్టి కొనుక్కోగా, టాట్ కుమిన్స్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 4.5 కోట్లకు, మిచెల్ జాన్సన్ ను రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. శ్రీలంక ఆటగాడు లక్ష్మణ్ సందక్కన్, బ్రాడ్ హాగ్, కైల్ అబాట్, ప్రజ్ఞాన్ ఓజా, ఇమ్రాన్ తాహిర్ తదితరులు అమ్ముడు పోని ఆటగాళ్ల జాబితాలో నిలిచారు.

  • Loading...

More Telugu News