: ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయిన విమానం.. దారి చూపిన ఫైటర్ విమానాలు!


ముంబయి నుంచి లండన్‌ బయల్దేరిన జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777-300 9డబ్ల్యూ118 విమానం జర్మనీలో ఆకాశంలో ఉండ‌గా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోవ‌డంతో అందులోని 330 మంది ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ విమానంలో వారితో పాటు 15 మంది సిబ్బంది కూడా ఉన్నారు. స‌మాచారం అందుకుని వెంటనే జర్మనీ వాయుసేనకు చెందిన రెండు యూరో ఫైటర్‌ విమానాలను రంగంలోకి దింప‌గా అవి  బోయింగ్‌777-300 9డబ్ల్యూ118 విమానంకి మార్గదర్శనం చేస్తూ రక్షణగా వెళ్లాయి. ఇందుకు సంబంధించిన ఫుటేజీని ది ఏవియేషన్‌ హెరాల్డ్‌ విడుదల చేసింది. అందులో యుద్ధ‌విమానాలు రెండు ఆవిరిని విడుదల చేస్తూ బోయింగ్‌కు దారి చూపించిన‌ట్లు తెలుస్తోంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది కమ్యూనికేషన్‌ కోసం తప్పుడు ఫ్రీక్వెన్సీని ఎంచుకోవటంతో ఈ స‌మ‌స్య త‌లెత్తింది.  ఈ వీడియోపై జెట్‌ ఎయిర్‌వేస్ స్పందిస్తూ ఆ విమానానికి తాత్కాలికంగా సంబంధాలు తెగిపోయాయని, అయితే కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించామని తెలిపింది. స్లొవేకియాలోని ఏటీసీ ఈ విమాన బాధ్యతలను పరాగ్వేలోని ఏటీసీకి అప్పజెప్పే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News