: కిమ్ జాంగ్ నామ్ ను హత్య చేసింది ఓ యువతి... ముఖంపై విషం కొట్టి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీలో
నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను హత్య చేసేందుకు ప్రత్యర్థులు ఓ యువతిని వాడుకున్నారు. జపాన్ టీవీ చానల్ 'ఫుజి' ప్రసారం చేసిసి సీసీటీవీ దృశ్యాల ప్రకారం, మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి మకావుకు బయలుదేరుతున్న నామ్ ముఖంపై తక్షణ ప్రభావం చూపించే విషయాన్ని ఈ యువతి స్ప్రే చేసింది. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు రెండు యాంగిల్స్ నుంచి సీసీటీవీలో నమోదయ్యాయి. ఆపై కాసేపటికే నామ్ మరణించగా, విచారణలో భాగంగా, ఓ వియత్నం, మరో ఇండొనేషియా మహిళలను, మలేషియా, నార్త్ కొరియాకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యతో సంబంధముందని భావిస్తున్న మరో నలుగురి కోసం వెతుకుతున్నట్టు తెలిపారు.