: కట్టలు కట్టలుగా రద్దయిన నోట్లు.. మార్చుకుంటూ పట్టుబడ్డ కేటుగాళ్లు


ఏ ష‌ర‌తులూ లేకుండా పాత‌నోట్ల‌ను మార్చుకునే గ‌డువు ముగిసి రెండున్న‌ర నెల‌లు అయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం పాత నోట్ల‌ను క‌లిగి ఉండే వారిని నేర‌స్థులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని కూడా కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. అయిన‌ప్పటికీ క‌ట్ట‌లుక‌ట్టలుగా ఉన్న పాత‌నోట్ల‌ను మార్చుకునే ప్ర‌య‌త్నాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఇటువంటి ప్ర‌య‌త్నం చేసే ముగ్గురు వ్య‌క్తులు పోలీసుల‌కి అడ్డంగా దొరికిపోయారు. నెల్లూరు మాగుంట లేఅవుట్‌ కింగ్స్‌కోర్ట్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యాపారి వేమూరు నరహరిరెడ్డి వద్ద రూ.50 లక్షల పాత వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి.

న‌ర‌హ‌రి.. మన్సూర్‌నగర్‌కు చెందిన కొత్తూరు శ్రీనివాస్, నరసింహకొండకు చెందిన కుర్రా శ్రీకాంత్‌రెడ్డి సాయంతో ఆ నోట్ల‌ను మార్చుకోవాల‌నుకున్నాడు. అందుకోసం అందులో సగం డబ్బు చెల్లించుకుంటాన‌ని చెప్పాడు. వీరి గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు నరహరిరెడ్డి ఇంటికి వెళ్లి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News