: బెన్ స్టోక్స్ కు జాక్ పాట్... ఐపీఎల్ 2017 వేలంలో ఎవరికెంత ధరంటే..!


ఈ సీజన్ ఐపీఎల్ లో ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రూ. 2 కోట్లకు కింగ్స్ లెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలి కాలంలో దూకుడైన ఆటతీరుతో సత్తా చాటిన బెన్ స్టోక్స్ కు జాక్ పాట్ తగిలింది. ఈ ఆటగాడిని పుణె సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ వేలంపాటల్లో అత్యధిక ధర పలికిన ఇంటర్నేషనల్ ప్లేయర్ గా స్టోక్స్ నిలిచాడు. ఇంతవరకూ ఈ రికార్డు షేన్ వాట్సన్ (రూ. 9.5 కోట్లు) పేరిట ఉంది.

ఆల్ రౌండర్ పవన్ నేగిని రూ. కోటితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మ్యాథ్యూస్ ను రూ. 2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ఆండర్సన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. కోటితో దక్కించుకుంది. మంచి ధర పలుకుతారని భావించిన ఇర్ఫాన్ పఠాన్ తో పాటు కివీస్ ఆటగాళ్లు గుప్తిల్, జాసన్ రాయ్, ఫయాజ్ ఫజల్, సీన్ అబాట్, రాస్ టేలర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపలేదు.

మొత్తం మీద ఈ సీజనులో విదేశీ ఆటగాళ్లను తమ టీముల్లోకి చేర్చేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తక్కువ ధరకు లభించే దేశవాళీ కుర్రాళ్లపైనే టీము యజమానుల దృష్టి ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ వేలం ప్రారంభం సమయానికి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ వద్ద అత్యధికంగా రూ. 23 కోట్లుండగా, ముంబై ఇండియన్స్ వద్ద అతి తక్కువగా రూ. 11.55 కోట్లు మాత్రమే ఉంది. ఈ వేలం బెంగళూరులో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News