: స్కూటర్ పై సంజయ్ దత్ ఫ్యామిలీ.. ‘సెట్’ లో సందడి!


ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హీరోగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భూమి’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆగ్రాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆసక్తికర సంఘటన జరిగింది. సంజయ్ దత్ భార్య మాన్యత, ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్లారు. దీంతో, బజాజ్ స్కూటర్ పై తన కుటుంబాన్ని ఎక్కించుకుని షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సంజయ్ చక్కర్లు కొట్టాడు. చిత్ర బృందం సహా మిగిలిన క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు ఆసక్తిగా వారిని తిలకించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సంజయ్ దత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News