: ‘మాస్ మహారాజా’ మూడు తరాల ఫొటో ఇది!
‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో రవితేజ తన తండ్రి, కొడుకులతో కలిసి వుండడం విశేషం. ‘మూడు తరాల ఫొటో ఇది’ అంటూ ఆ ఫొటోను మాస్ మహారాజా స్వయంగా పోస్ట్ చేశాడు. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు దూరంగా ఉండే రవితేజ, ఇటీవలి కాలంలో దగ్గరవుతుండటం విశేషం. తన ఫ్యామిలీ ఫొటోను రవితేజ ఇటీవల పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు.