: పన్నీర్ సెల్వం ఓ దుష్టశక్తి.. ‘చిన్నమ్మ’ సమర్థంగా ఎదుర్కొన్నారు!: విజయశాంతి
పన్నీర్ సెల్వం లాంటి దుష్ట శక్తులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ ‘చిన్నమ్మ’ శశికళ సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామికి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. అన్నాడీఎంకే పార్టీకి ఏమాత్రం చెడు జరగకుండా ఉండేందుకు చిన్నమ్మ రక్షణగా నిలుస్తుంటే, ఆ పార్టీకి హాని చేసేందుకు పన్నీర్ సెల్వం చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా, తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి అనంతరం, శశికళను విజయశాంతి పరామర్శించారు. తమిళనాడు సీఎం కుర్చీ శశికళకే దక్కాలని గతంలో ఆమె వ్యాఖ్యానించారు.