: ‘వికీపీడియా’లో పళనిస్వామి పేరు మార్చేశారు!


తమిళనాడు సీఎం పళనిస్వామి పేరు స్థానంలో ‘శశికళకు బానిస’ అని ప్రముఖ వెబ్ సైట్ ‘వికీపీడియా’లో రాసి ఉండటాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పళనిస్వామి వివరాలు తెలియజేస్తూ ఉన్న ఆ సైట్ లో ఆయన ఫొటో కూడా పొందుపరిచారు. ఆ ఫొటోపైన ‘తమిళనాడు ముఖ్యమంత్రి’ అని, ఫొటో కింద ‘శశికళ బానిస’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ సమాచారం సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారడంతో, సదరు సంస్థ వెంటనే స్పందించింది. ఆ రాతలను తొలగించింది. కాగా, ‘మన్నార్ గుడి మాఫియా’కు చెందిన వ్యక్తి పళనిస్వామి అని పేర్కొని ఉన్న మరో ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News