: శశికళకు ల్యాప్ టాప్ ఇవ్వండి!: నటుడు సిద్ధార్థ్ వ్యంగ్యాస్త్రాలు
అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్శ విషయం, ఆమె వర్గానికి చెందిన పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది సినీ నటుడు సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ ను కలిసేందుకు సీఎం పళని స్వామి తరచుగా తిరగాల్సి ఉంటుందని, అందుకు చెక్ పెట్టాలంటే శశికళకు ఓ ల్యాప్ టాప్ ఇస్తే వారిద్దరూ దాని ద్వారా విషయాలు తెలుసుకుంటూ ఉంటారని, అంతేకాకుండా, పళనిస్వామి రవాణా ఛార్జీలు మిగులుతాయని తన ట్వీట్ లో సిద్ధార్థ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ సందర్భంగా తమిళులు పౌరుషం పెంచుకోవాలని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. మనం తినే ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలని ఆ ట్వీట్ లో కోరాడు.