: ధోనీకి షాకిచ్చిన పుణె టీమ్.. కెప్టెన్సీ తొలగింపు!


ధోనీకి పుణె టీమ్ షాక్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -10 సీజన్ కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా ధోనీని తొలగించారు. ఈ మేరకు పుణె యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ధోనీ స్థానంలో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు. కాగా, ఐపీఎల్ -10  ప్రారంభానికి ముందే ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడం గమనార్హం. ఐపీఎల్ -9 సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన పుణె జట్టు, కేవలం ఐదు విజయాలను మాత్రమే నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఏడో స్థానానికి పడిపోయింది. ఆ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టీమ్ మొదటి స్థానంలో నిలవగా, పుణె జట్టు చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 

  • Loading...

More Telugu News