: మే 12న తెలంగాణ ఎంసెట్.. నోటిఫికేషన్ రేపే!
తెలంగాణ ఎంసెట్ పరీక్ష మే 12న జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, రేపు నోటిఫికేషన్ ను వెలువరించనున్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుందని, ఈ దఫా మరిన్ని పరీక్షా కేంద్రాలు ఉంటాయని, ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం పరీక్షల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని, ఏ విధమైన కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూస్తామని పేర్కొన్నారు.