: పోలీసుల ముందు వింత సమస్య... భార్యాభర్తల్లా కలిసుంటామంటున్న ఇద్దరమ్మాయిలు!


తాము ప్రేమించుకున్నామని, ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోతున్నామని, దంపతుల్లా కలిసుంటామని చెబుతూ, వివాహమై భర్తకు దూరమైన ఓ యువతి, మరో అమ్మాయి (విద్యార్థిని) పోలీసుల సాయం కోరడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని మధురలో జరిగింది. తమకు సహకరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వీరు హెచ్చరిస్తుండటంతో, వారి తల్లిదండ్రులను స్టేషనుకు పిలిపించారు పోలీసులు. మధురకు సమీపంలోని రెండు పక్క పక్క గ్రామాలకు చెందిన వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని చెబుతున్నారు. తమ బంధాన్ని అంగీకరించని తల్లిదండ్రులు హింసిస్తున్నారని పోలీసులకు వీరు ఫిర్యాదు చేశారు. ఇక ఈ వింత కేసును ఎలా పరిష్కరించాలో తెలియని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News