: అవినీతి ఎక్కువైందా? మరి ఎన్నికల్లో డబ్బులెలా వస్తాయి?.. ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే


కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.వెంకటేశ్ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని, నాయకులు అవినీతిపరులు అయిపోయారని అందరూ విమర్శిస్తుంటారని, మరి అవినీతికి  పాల్పడకుంటే ఎన్నికల సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు వెళ్లినప్పుడు ఓటర్లకు తృణమో, పణమో సమర్పించుకోవాల్సి ఉంటుందని, మరి ఆ డబ్బులను ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడడంలో తప్పులేదని బహిరంగంగానే పేర్కొన్న వెంకటేశన్‌పై విమర్శల దాడి మొదలైంది. అవినీతి రాజకీయ నాయకుల జన్మహక్కులా బాహాటంగానే 'అది చేస్తాం.. ఇది చేస్తాం' అని పేర్కొన్న వెంకటేశ్ వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News