: తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తల ఆందోళనలు.. రాజ్‌భవన్‌పైకి రాళ్లు రువ్విన వైనం
తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆ రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభలో తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కూడా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. రాజ్‌భవన్‌పైకి డీఎంకే కార్యకర్తలు రాళ్లు రువ్వారు. వేలాది మంది కార్యకర్తలు మెరీనా బీచ్‌కు వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు మరోసారి 144 సెక్షన్ విధించారు. ఆ రాష్ట్రంలోని ఆర్నీ, అంబూర్, వనియంబడి, రాజీపేట్ తో పాటు పలు ప్రాంతాల్లో స్పీకర్ ధన్‌పాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.