: విరాట్ కోహ్లీ ఈ స్థాయిలో ఉండటానికి ఈ పుస్తకమే కారణమట!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. సెంచరీలతో విరుచుకుపడుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అయితే, కోహ్లీ ఇంతటి ఘన విజయం సాధించేందుకు ఓ పుస్తకమే కారణమట. 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి' పుస్తకాన్ని చదవడమే తన విజయానికి కారణమని కోహ్లీ స్వయంగా తెలిపాడు. అంతేకాదు చాలెంజ్ లు స్వీకరించాలనుకునే ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదవాలంటూ సూచించాడు. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని సరిగా వినియోగించుకుంటే... అది మన జీవన విధానాన్నే మార్చివేస్తుందని కోహ్లీ చెప్పాడు. మంచి పనులు చేయడం, ప్రేమించడం, గొప్పగా ఉండటం, ఒకరికొకరు సహకరించుకోవడం వంటివి మనలను ఉన్నతులను చేస్తాయని తెలిపాడు. ఈ పుస్తకాన్ని పరమహంస యోగానంద రచించారు.