: స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టు.. మెరీనా బీచ్ లో తీవ్ర ఉద్రిక్తత!
తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ చినిగిన చొక్కాతోనే చెన్నై మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి భారీగా డీఎంకే కార్యకర్తలు చేరుకుంటుండడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని స్టాలిన్‌తో పాటు ఆయన సహచర ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.