: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ కూతురు
బాలీవుడ్ లో స్టార్ల కుమార్తెలు వెండి తెరపై వెలగడం సాధారణమే. ఈ క్రమంలో, మరో స్టార్ కుమార్తె ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు సీక్వెల్ తీస్తానని కరణ్ జొహార్ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా తొలుత దిశా పటానిని అనుకున్నప్పటికీ... చివరకు సారాను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని సైఫ్ ఖాన్ కూడా అంగీకరించాడు. తన కుమార్తె సినీ రంగంలోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.