: 'పవర్' స్టార్ పళనిస్వామి... బల పరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి!
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి నెగ్గారు. ఈ ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగిన పలు పరిణామాల అనంతరం ఆయన తన బలాన్ని నిరూపించుకున్నారు. సభ నుంచి డీఎంకే సభ్యులు వెళ్లిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ కూడా వాకౌట్ చేసింది. ఈ క్రమంలో, ఓటింగ్ నిర్వహించారు. హైడ్రామా మధ్యనే స్పీకర్ ఓటింగ్ ను ముగించారు. అనంతరం విశ్వాస పరీక్షలో పళనిస్వామి గెలిచినట్టు ప్రకటించారు. దీంతో, అన్నాడీఎంకే శిబిరంలో ఆనందం నెలకొంది. చివరకు అమ్మే గెలిచింది అంటూ పళనిస్వామి వర్గీయులు నినాదాలు చేశారు.