: తమిళనాడు అసెంబ్లీ తీరుపై సుబ్రహ్మణ్య స్వామి స్పందన
తమిళనాడు అసెంబ్లీలో నేడు జరుగుతున్న పరిణామాలపై భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఈ రోజు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... డీఎంకే ఎమ్మెల్యేలు ఎంతో ప్రమాదకరమని అన్నారు. డీఎంకే దేశ వ్యతిరేక పార్టీ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శశికళ నటరాజన్ ఎలాంటి వారయినా సరే ఆమె డీఎంకే నేతల కన్నా బెటరేనని ఆయన వ్యాఖ్యానించారు. గతకొన్ని రోజులుగా ఆయన శశికళ వర్గానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు సభలో డీఎంకే నేతల స్పందన చూసిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.