: రెండు, మూడవ డివిజన్లలోనూ పళనిస్వామిదే విజయం
తమిళనాడు సీఎం పళనిస్వామి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో సభ వాయిదా పడడానికి ముందు మొదటి మూడు డివిజన్లలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం 230 మంది సభ్యులు హాజరైన ఈ పరీక్షలో సభ్యులను మొత్తం ఆరు డివిజన్లుగా విభజించి లెక్కింపు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మొదటి డివిజన్‌లో మొత్తం 38 మంది సభ్యులు పళనిస్వామికి అనుకూలంగా నిలవగా రెండు, మూడో బ్లాకుల్లోనూ లెక్కింపు పూర్తయింది. ఈ బ్లాకుల్లోనూ పళనిస్వామే పై చేయి సాధించారు. మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం మళ్లీ కౌంటింగ్ మొదలు కానుంది. ఒక్కో బ్లాకు నుంచి 38 మంది ఓట్లు వేస్తున్నారు.