: రహస్య ఓటింగ్ ను తిరస్కరించిన స్పీకర్.. హెడ్ కౌంట్ కు అనుమతి
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్ష నేత స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు రహస్య ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ ను కోరారు. రహస్య ఓటింగ్ జరిగితేనే ఎమ్మెల్యేలు తమ మనోభావాల మేరకు ఓటు వేయగలుగుతారని వీరు చెప్పారు. అయితే, వీరి వినతిని స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో డివిజన్ కు వెళ్లడానికి స్పీకర్ ఓకే చెప్పినట్టు సమాచారం. డిజిజన్ నేపథ్యంలో, తొలుత ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కిస్తారు. ఆ తర్వాత, ఆయనను వ్యతిరేకిస్తున్న వారిని లెక్కిస్తారు. ఈ క్రమంలో, మేజిక్ ఫిగర్ ను పళనిస్వామి సాధిస్తే, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. లేకపోతే, వెంటనే గవర్నర్ ను కలిసి, రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది.