: తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. రహస్య ఓటింగ్ కోసం పట్టుబడుతున్న పన్నీర్, స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాసేపట్లో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అన్నాడీఎంకే పార్టీలోని పళనిస్వామి వర్గంలో 122, పన్నీర్ వర్గంలో 12, డీఎంకే వర్గంలో 88, కాంగ్రెస్ నుంచి 8, ముస్లిం లీగ్ నుంచి 1 సభ్యుడు ఓటింగ్లో పాల్గొననున్నారు. కరుణానిధి ఈ సమావేశానికి గైర్హాజరు అవుతున్న విషయం తెలిసిందే. దీంతో పళనిసెల్వం నెగ్గాలంటే ఆయనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరికాసేపట్లో ఆయన భవితవ్యం తేలిపోనుంది. మరోవైపు పన్నీర్, స్టాలిన్ రహస్య ఓటింగ్ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.