: హైదరాబాద్‌లో అర్ధరాత్రి పెళ్లి ఊరేగింపు.. ఇద్దరు అరెస్ట్.. జైలు శిక్ష


అర్ధరాత్రి దాటినా పెళ్లి బరాత్‌తో స్థానికులను ఇబ్బందికి గురిచేయడంతోపాటు ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి  హైదరాబాద్‌లోని అడ్డగుట్టలో ఓ వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఘనంగా పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. అర్ధరాత్రి దాటినా బరాత్ కొనసాగుతుండడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నాంటూ శివశంకర్, డప్పుకొట్టిన బాషా అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చారు. కేసును విచారించిన కోర్టు వారికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News