: సరబ్ జిత్ వ్యవహారంలో మెత్తబడిన పాక్
ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సరబ్ జిత్ ను చూసేందుకు ఇప్పటివరకు భారత దౌత్యాధికారులకు అనుమతించని పాకిస్తాన్ ఎట్టకేలకు వెనక్కితగ్గింది. భారత్ నుంచి తీవ్ర ఒత్తిళ్ళు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సరబ్ జిత్ ను చూసేందుకు దౌత్యాధికారులను అనుమతిస్తూ పాక్ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే, రోజుకు ఒక్కసారిగా మాత్రమే సరబ్ జిత్ ను చూడొచ్చంటూ మెలికబెట్టి తన కుత్సిత బుద్ధిని చాటుకుంది. ఈ రోజు ఉదయం పాక్ లో భారత హై కమిషనర్ శరత్ సభర్వాల్ పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి జలిల్ అబ్బాస్ జిలానీని కలిసి సరబ్ జిత్ వ్యవహారంపై చర్చించారు.