: 30 ఏళ్ల క్రితం టీవీలో దాచి పెట్టిన నోట్ల కట్టలు తిరిగి యజమాని వద్దకు చేరాయి!


ఆ వ్య‌క్తి 30 ఏళ్ల క్రితం తన పెద్ద టీవీ డబ్బాలో క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా డ‌బ్బు దాచాడు. 'అవసరమైనప్పుడు తీసుకుందాంలే' అనుకున్నాడు. అయితే, కొన్నాళ్లు గ‌డిచాక తాను ఆ డ‌బ్బు దాచిన విష‌యాన్నే మ‌ర్చిపోయాడు. ఆ టీవీని వేరే వారికి ఇచ్చేశాడు. అయితే, 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆయ‌న దాచుకున్న డ‌బ్బు తిరిగి ఆయ‌న వ‌ద్దకే చేరింది. దీంతో ముందుగా ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఆ తర్వాత హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే, కెనడాకు  చెందిన ఓ వ్యక్తి (68) ఇంట్లో ఎవ‌రికి తెలియకుండా 30 ఏళ్ల క్రితం దాదాపు లక్ష కెనడా డాలర్లను అందులో దాచిపెట్టి మ‌ర్చిపోయాడు. కొన్నాళ్లకు త‌మ టీవీని త‌న‌ స్నేహితుడికి కానుకగా ఇచ్చాడు. ఎంతో మంది చేతులు మారి చివరకి ఓ రీసైక్లింగ్ యూనిట్‌కు వ‌చ్చింది.

అక్క‌డికి చేరిన‌ ఈ  టీవీని తెరిచిన కార్మికురాలు అందులో ఏకంగా 76,560 డాలర్లు ( సుమారు రూ.67లక్షలు) ఉండ‌డాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. ఆ డ‌బ్బుపై ఆశ‌ప‌డ‌కుండా, వెంట‌నే త‌మ‌ యాజమాన్యానికి చెప్పింది. అనంత‌రం దాని య‌జ‌మాని వెంటనే పోలీసులకు ఈ విష‌యం చెప్పారు. ఆ టీవీ డ‌బ్బాలో ఆ డ‌బ్బుతో పాటు ప‌లు డాక్యుమెంట్లు కూడా ల‌భించాయి. వాటి ఆధారంగానే పోలీసులు నిజమైన యజమాని అడ్రస్‌ తెలుసుకొని ఆ డ‌బ్బుని అతనికి ఇచ్చారు.

  • Loading...

More Telugu News