: అన్నాడీఎంకే నేత నోటి వెంట ‘పళనియమ్మ’!


తమిళ ప్రజలు ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు దివంగత సీఎం జయలలితను ‘అమ్మ’గా పిలుచుకుంటూ ఉంటారు. తమిళనాడులో సంక్షేమ పథకాలూ ‘అమ్మ’ అనే పదంతోనే లింక్ అయి ఉంటాయి. అన్నాడీఎంకే పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు జయలలిత గురించి ప్రస్తావించాల్సి వచ్చిన ప్రతిసారి, ఆమెను ‘అమ్మ’గానే సంబోధిస్తారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి గురించి ప్రస్తావించారు.

ఇన్నాళ్లూ ‘అమ్మ’ జయలలిత గురించి, ‘చిన్నమ్మ’ శశికళ గురించి మాట్లాడిన సరస్వతి, పళనిస్వామి గురించే మాట్లాడేటప్పుడు ఒక పొరపాటు చేశారు. పళనిస్వామికి బదులు ‘పళనియమ్మ’ అనేశారు. దీంతో, ఆమెపై జోక్స్ పేలుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో నెటిజన్లు సరస్వతిపై జోక్స్ కురిపిస్తున్నారు. ‘అమ్మ’, ‘చిన్నమ్మ’ అని పలికిన నోటికి ‘పళనియమ్మ’ అని కాక, ఇంకేమొస్తుందంటూ నెటిజన్లు తమ దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

  • Loading...

More Telugu News