: రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఏకైక లక్షణమది: సీఎం చంద్రబాబు
రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఏకైక లక్షణం ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావడమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసం లేనిదే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని, ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా చేయకపోతే ప్రజల విశ్వసనీయతను కోల్పోతామని చెప్పారు. ముప్పై ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కార్యకర్తల బలంతో టీడీపీ ఈ స్థాయికి ఎదిగిందని, ఏపీలో శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.