: సినీ నటుడు నగేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు
‘పక్కాప్లాన్’ అనే సినిమాలో రెండో హీరోగా నటించిన కర్ణాటక యాద్గీర్ జిల్లా వాజిఖానాపేట గ్రామానికి చెందిన నగేష్‌ను హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సదరు నటుడు నాగరాణి అనే తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమెతో కొన్నాళ్లు సహజీవనం చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, కొన్ని రోజులుగా ఆమెను దూరంగా ఉంచుతున్నాడని తెలిపారు. బాధితురాలు తనను నగేష్ నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిందని, దీంతో నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
‘పక్కాప్లాన్’ అనే సినిమాలో నగేష్‌కి జోడీగా నాగరాణి నటించింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సహజీవనం చేసేవరకు వెళ్లింది. అయితే, నాగరాణికి అప్పటికే ఆరేళ్ల కూతురు ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణానగర్‌లో వీరిరువురూ సహజీవనం చేశారు.