: స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం!
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో రేపు బలపరీక్షకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో రేపు జరగనున్న బలపరీక్షపై ఆయన చర్చించినట్లు సమాచారం. కాగా, అన్నాడీఎంకే లో చీలిక రావడం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో ఉండటం, తనకు సీఎం కుర్చీ దక్కలేదని పన్నీర్ అసంతృప్తితో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలనిరూపణ సమయంలో పళనిస్వామికి మద్దతుగా ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఎంత మంది బయటకు వస్తారు? అనేది త్వరలో తేలనుంది. పన్నీర్ సెల్వంకు ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు.