: టేలర్, స్టీవ్ వా, పాంటింగ్ లను క్లార్క్ అధిగమించాడు: సచిన్


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రశంసలు కురిపించాడు. 2015లో ఆసీస్ కు ప్రపంచకప్ ను సాధించిన క్లార్క్... ఆ దేశ దిగ్గజాలైన మార్క్ టేలర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ ల కంటే ఎక్కువ రేటింగ్ సాధించాడని కొనియాడాడు. ఆసీస్ కెప్టెన్లలో మైఖేల్ క్లార్క్ కే తాను ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పాడు. అలెన్ బోర్డర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు, తాను చిన్నవాడినని... అందువల్ల ఆయన కెప్టెన్సీని తాను అంచనా వేయలేనని తెలిపాడు. మార్క్ టేలర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్ లు కెప్టెన్ గా ఉన్న సమయంలో వారి జట్లలో అత్యున్నత స్థాయి ఆటగాళ్లు ఉన్నారని, అందువల్ల ఎక్కువ విజయాలు వారికి సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డాడు. అయితే, టీమ్ లో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పుడు, కెప్టెన్ పాత్ర తగ్గిపోతుందని చెప్పాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్ ఈ విషయాలను వెల్లడించాడు. 

  • Loading...

More Telugu News