: సచిన్ దృష్టిలో అత్యున్నత విదేశీ కెప్టెన్ ఇతనే!
తన 24 ఏళ్ల కెరియర్ లో తాను ఎదుర్కొన్న కెప్టెన్లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ బెస్ట్ అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. నాసిర్ హుస్సేన్ మంచి వ్యూహకర్త అని కితాబిచ్చాడు. కొన్నిసార్లు అతడి వ్యూహాలు విమర్శలకు తావిచ్చినా... ఆటలో అవన్నీ భాగమేనని చెప్పాడు. ఓ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు... లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆష్లే జైల్స్ కు బంతినిచ్చి, లెగ్ స్టంప్ కు వెలుపల వెళ్లేలా నాసిర్ బంతులేయించాడని... నాసిర్ ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఇది ఒక ఉదాహరణ అని తెలిపాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో ఈ విషయాలను సచిన్ పంచుకున్నాడు.
బ్యాట్స్ మెన్ ఒక షాట్ ఆడిన తర్వాత... ఫీల్డర్లను ఒక స్థానంలో నాసిర్ నిలకడగా ఉంచడని సచిన్ అన్నాడు. బ్యాట్స్ మెన్ ఆడబోయే షాట్ ను నాసిర్ అంచనా వేయగలడని... దానికి తగ్గట్టుగా ముందుగానే ఫీల్డర్ ను మోహరింపజేసే తెలివి నాసిర్ సొంతమని తెలిపాడు.