: సీఎంకు చంద్రబాబు లేఖ
ఏపీపీఎస్సీ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని 39 ఏళ్ళకు పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. డీఎస్సీ నియామకాల్లో వయోపరిమితిని 39 ఏళ్ళుగానే పరిగణిస్తున్నారని బాబు గుర్తు చేశారు. అంతేగాకుండా ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కనీస వయోపరిమితి 40 ఏళ్ళు అని తన లేఖలో పేర్కొన్నారు. 2011లో ఏపీపీఎస్సీ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని 39 నుంచి 34 ఏళ్ళకు తగ్గించడంతో ఎంతోమంది అభ్యర్థులు నష్టపోయారని బాబు వివరించారు. ఇకపై ఏపీపీఎస్సీ తాజా నియామకాల్లో వయోపరిమితిని పెంచాలని బాబు విజ్ఞప్తి చేశారు.