: జైలులో శశికళ తొలిరోజు ఇలా గడిచింది!


అక్రమాస్తుల కేసులో 20 ఏళ్ల అనంతరం దోషిగా నిర్ధారించబడి జైలుకెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలు జీవితం పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం జైలుకు చేరుకున్న ఆమెకు పోలీసులు రెండు రోటీలు, సాంబారు అందజేశారు. దానిని తినేందుకు ఏమాత్రం ఆసక్తి చూపని శశికళ ఆ రాత్రి తినకుండానే గడిపారు. నేలపై చాప, దిండు వేసుకుని నిద్రపోయారు. రాత్రంతా అసహనంగా కదిలిన శశికళ గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే మేలుకుని కాలకృత్యాలు ముగించి ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైలులోనే పచార్లు (మార్నింగ్ వాక్) చేశారు.

ఉదయం 6:30 గంటలకు వెజిటబుల్‌ పలావ్‌ తిన్నాక, జైలు గ్రంథాలయంలో ఇంగ్లీషు, తమిళ దినపత్రికలు చదివారు. అనంతరం కొద్దిసేపు బ్యారెక్‌ లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో టీ తాగారు. ఆ తరువాత వదిన ఇళవరసితో పాటు సహఖైదీలతో మాటల్లో పడ్డారని తెలుస్తోంది. శశికళ తొలిరోజు జైలు జీవితం ఈ రకంగా గడిచింది. నేడు తమిళనాడు ముఖ్యమంత్రి జైలులో ఆమెను కలిసేందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News