: తమిళనాట మళ్లీ కలకలం...జయలలిత సమాధి వద్దకు చేరుకున్న పన్నీర్ సెల్వం
తమిళనాడులో మళ్లీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నై, మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట ఆయన మద్దతుదారులంతా ఉన్నారు. సమాధి చెంతకు చేరుకున్న అనంతరం జయలలితకు నివాళులర్పించారు. దీంతో అందర్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పళనిస్వామి రేపు శశికళను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, పన్నీర్ సెల్వం మాత్రం జయలలిత సమాధి చెంతకు చేరుకోవడం ఆసక్తి రేపుతోంది. నివాళులర్పించిన అనంతరం అంతా వెనుదిరిగారు. బల నిరూపణకు మరో మూడు రోజుల సమయం ఉండడంతో ఆయన ఎలాంటి అడుగులు వేయనున్నారన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఈ నెల 7న ఆయన మౌన దీక్ష చేపట్టిన అనంతరం ఆయన మళ్లీ శశికళ సమాధి వద్దకు వెళ్లడం ఇది రెండోసారి, గతంలో జయలలిత మేనకోడలు దీపతో కలసి నివాళులర్పించిన సంగతి తెలిసిందే.