: ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తాం: పన్నీర్ సెల్వం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఈ రోజు మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తమ వర్గానికి ప్రతికూలంగా గవర్నర్ ప్రకటన వచ్చినప్పటికీ తాము ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తామని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. మళ్లీ రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలనను తీసుకొచ్చేలా పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ఓ కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ ఓ నియంత చేతిలో ఉందని అన్నారు. వారి కుట్రలను సాగనివ్వబోమని చెప్పారు.