: గోల్డెన్ బే రిసార్ట్స్ లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంబరాలు!
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పళనిస్వామికి ఆహ్వానం అందడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, చిన్నమ్మ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం తెలియడంతో గోల్డెన్ బే రిసార్ట్స్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతోషానికి హద్దులు లేవు. పన్నీర్ సెల్వంకు చుక్కెదురైందంటూ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కాగా, ఈ రోజు సాయంత్రం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఒక జాబితాను గవర్నర్ విద్యాసాగర్ రావుకు పళని స్వామి అందజేశారు.