: తమిళనాడుకు త్వరలో కొత్త గవర్నర్.. ప్రకటించిన బీజేపీ నేత
రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన తమిళనాడుకు త్వరలో కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్టు బీజేపీ జాతీయ కమిటీ కార్యదర్శి హెచ్.రాజా తెలిపారు. బుధవారం తిరుచ్చిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయన్ని తెలిపారు. రోశయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగర్‌రావును తమిళనాడుకు తాత్కాలిక గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో గవర్నర్‌ను నియమించనున్నట్టు రాజా తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం, నిర్ణయాన్ని జాప్యం చేయడంపై రాజా మాట్లాడుతూ అందులోని ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు.