: శశికళకు షాకిచ్చిన జడ్జి...ఇకపై ఆమె ఖైదీ నెంబర్ 9234
అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. శశికళ ఎలాంటి అవాంతరాలు లేకుండా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు ఖైదీ అయ్యారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం హాలులో జడ్జి ముందు లొంగిపోయారు. దీంతో శశికళ స్టేట్ మెంట్ ను జడ్జి రికార్డు చేశారు. అనంతరం జైలు అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. దాని సమాచారం కోర్టుకు అందజేశారు. అనంతరం ఆమెను జైలులోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఖైదీ వస్త్రాలు, ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు. ఆమె వదిన ఇళవరసికి ఖైదీ నెంబర్ 9235ను కేటాయించారు. సుధాకరన్ కు 9236 నెంబర్ ను కేటాయించారు. కాకుంటే, ఆయనకు పురుషుల జైలులో నెంబర్ కేటాయిస్తారు. శశికళ కోరిన ఏసీ రూం, టీవీ, ఇంటి భోజనం, పని మనిషి (సహాయకురాలు) కోరికలను న్యాయమూర్తి నిర్ద్వంద్వందంగా తోసిపుచ్చారు. దీంతో శశికళకు షాక్ తగిలింది.