: శశికళ కంటే స్టాలిన్‌, దయానిధి మారన్, కళానిధి మారన్ ఎంతో ప్రమాదకరం: సుబ్రహ్మణ్య స్వామి


తమిళనాడు అధికార‌ అన్నాడీఎంకే పార్టీలో ఏర్ప‌డిన సంక్షోభం నేప‌థ్యంలో ఆ రాష్ట్రమంత్రి ప‌ళ‌నిస్వామితో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని త‌న‌ అభిప్రాయం వ్య‌క్తం చేస్తూ వ‌స్తోన్న బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ రోజు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌పై మండిప‌డ్డారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... త‌మిళ‌నాడులో శశికళ కంటే స్టాలిన్‌, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ లు ప్రమాదమైన వ్యక్తులని ఆయ‌న పేర్కొన్నారు.

మనం చేయాల్సింది మాత్రం ఇంకా మిగిలే ఉందని, డీఎంకే నేత‌ల‌ను ఓడించ‌డం అంటే నియంతగా శాశ్వతంగా నిలిచిపోయిన అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీలపై గెలుపు సాధించ‌డ‌మేన‌ని చెప్పారు. వారు నిరుద్యోగులను రిక్రూట్ చేసుకొని వారితో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేయిస్తున్నారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. వాటి నుంచి చేస్తున్న ఒక్కో తప్పుడు ట్వీట్ కు స‌ద‌రు నేత‌లు నిరుద్యోగుల‌కు రూ.200 ఇస్తున్నట్టు ఆయ‌న తెలిపారు.  

  • Loading...

More Telugu News