: పవన్ కల్యాణ్ సరసన చేరిన నాని


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన యంగ్ హీరో నాని నిలిచాడు. నాని నటించిన మూడు సినిమాలు (ఈగ, భలే భలే మొగాడివోయ్, నేను లోకల్) సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన లిస్ట్ లో నిలిచాయి. పవన్ కల్యాణ్ కూడా ఈ ఫీట్ ను మూడు సార్లు సాధించారు. ఆయన నటించిన అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ లు మిలియన్ డాలర్ మార్క్ ను దాటాయి.

ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు తొలి స్థానంలో ఉన్నాడు. అతను నటించిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. అతని చిత్రాలు బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లు మిలియన్ మార్క్ ను దాటాయి. 

  • Loading...

More Telugu News