: తప్పించుకుని వచ్చిన ఎమ్మెల్యే ఫిర్యాదుతో... రిసార్టులో ఎమ్మెల్యేలను మరోసారి ప్రశ్నిస్తున్న పోలీసులు
శశికళ నటరాజన్ తనను కిడ్నాప్ చేసి గోల్డెన్ బే రిసార్టులో ఉంచారని, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని కొద్ది సేపటి క్రితం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్ కూవత్తూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతోనే భారీ సంఖ్యలో పోలీసులు గోల్డెన్ బే రిసార్టుకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం రిసార్టులోని ఎమ్మెల్యేలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వారిని పోలీసులు ప్రశ్నించగా వారు తమ ఇష్టపూర్వకంగానే అక్కడకు వచ్చినట్లు తెలిపారు. అయితే, అప్పుడు పోలీసులకు అలా చెప్పిన వారిలో శరవణన్ కూడా ఉన్నారు. ఈ రోజు మరోసారి సదరు ఎమ్మెల్యేలను పోలీసులు ప్రశ్నిస్తుండడంతో విషయం ఆసక్తికరంగా మారింది.