: గోల్డెన్ బే రిసార్టును మరోసారి చుట్టుముట్టిన పోలీసులు
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడిన శశికళ నటరాజన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో శశికళ కోర్టులో లొంగిపోవడానికి బెంగళూరు వెళ్లిన నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్టును పోలీసులు ఈ రోజు మరోసారి చుట్టుముట్టారు. అయితే, వారు అక్కడకు ఎందుకు చేరుకున్నారో స్పష్టంగా తెలియరాలేదు. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు పంపించేందుకే పోలీసులు అక్కడకు చేరుకున్నారని భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసారగ్ రావు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.