: శశికళ కోసం బెంగళూరు వెళుతున్నా.. ఆమెకు అండగా ఉంటా: నటరాజన్


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో, కోర్టులో లొంగిపోయేందుకు శశికళ రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఆమె భర్త నటరాజన్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, శశికళతో తాను నిరంతరం టచ్ లోనే ఉంటానని, ఆమెకు అండగా నిలబడతానని చెప్పారు. శశి రోడ్డు మార్గంలో వెళ్లిందని, ఆమె కోర్టుకు చేరుకునేలోగానే తాను విమానంలో వెళ్లి, కోర్టు వద్దకు చేరుకుంటానని చెప్పారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని తెలిపారు. తమ బంధువులను పార్టీ పదవుల్లో నియమించడం... పార్టీ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 

  • Loading...

More Telugu News