: మరో ముందడుగు.. బ్రహ్మోస్ క్షిపణి పరిధిని రెట్టింపు చేసేలా భారత్ ప్రయోగాలు
బ్రహ్మోస్ క్షిపణిని సరిహద్దు వద్ద ఉంచి, శత్రుదేశాలు దూకుడును ప్రదర్శిస్తే గట్టి సమాధానం చెబుతామని సంకేతాలు ఇచ్చిన భారత్ మరో ముందడుగు వేస్తోంది. ఈ క్షిపణికి ప్రస్తుతం 300 కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే, ఆ సామర్థ్య పరిధిని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చేనెల 10న ఈ క్షిపణికి సంబంధించిన కొత్త వర్షెన్‌ను పరీక్షించనుంది. ఈ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు ఉంటుంది. రష్యాతో కలిసి భారత్.. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (ఎంసీటీఆర్) ఈ కొత్త తరహా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త వర్షెన్ పరీక్ష అనంతరం తిరిగి బ్రహ్మోస్‌ను 800 కిలోమీటర్ల దూరం వెళ్లగల వెరైటీని కూడా పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రానున్న మూడేళ్లలో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించేలా చేస్తామని పేర్కొన్నారు.