: వేరే ఆప్షన్ లేదు.. ఇక ప‌ళ‌నిస్వామితో త‌మిళ‌నాడు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించండి: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి


అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్ష నేత‌గా ఎన్నికైన ప‌ళ‌నిస్వామితో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించాల‌ని బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయ‌న ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకేలో ప‌న్నీర్ సెల్వంకు  మ‌ద్ద‌తులేదని అన్నారు. ప‌ళ‌నిస్వామి ఇప్పటికే గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుని క‌లిసి త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తోన్న ఎమ్మెల్యేల లేఖ‌ను ఇచ్చార‌ని తెలిపిన సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి.. మరోవైపు ప‌న్నీర్ సెల్వం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆ ప‌నిచేయ‌లేద‌ని చెప్పారు. ఇక ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి వేరే ప్ర‌త్నామ్యాయం లేద‌ని, ప‌ళ‌నిస్వామితో ప్ర‌మాణ  స్వీకారం చేయించాల‌ని చెప్పారు. ఈ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈ అంశంపై ఇంకా ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు.

  • Loading...

More Telugu News