: కొత్తగా వ‌చ్చిన న‌టులు పలు విషయాలను ఎదుర్కోవడంలో సందిగ్ధంలోనే ఉంటున్నారు: అనుష్క శర్మ


అద్భుతమైన నటన, యువతను ఆక‌ట్టుకునే అందంతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న న‌టి అనుష్క శ‌ర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో... సీనియర్‌, జూనియర్‌ నటుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడింది. ప్రతి నటుడి నటన మరొకరితో భిన్నంగానే ఉంటుంద‌ని ఆ భామ అభిప్రాయ‌ప‌డింది. ముగ్గురు బాలీవుడ్‌ ఖాన్‌ల విషయానికొస్తే వాళ్లు ఎంతో కాలంగా సినీ రంగంలో ఉన్నార‌ని, వారికి చాలా అనుభవాలు ఉన్నాయని చెప్పింది. ఎంతో మంది న‌టులు తమకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకొని సినీరంగ ప్ర‌వేశం చేస్తార‌ని తెలిపింది.

సినిమాల్లో సీనియర్‌ నటులతో నటించినపుడు కెరీర్‌ పరంగా వాళ్లు  దిశానిర్దేశం చేస్తుంటారని అనుష్క శర్మ చెప్పింది. వాటితో పాటు సీనియ‌ర్ న‌టుల‌కి సినిమా నిర్మాణ క్రమంలో ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుస‌ని, వాటిని వారు చాలా ప్రశాంతంగా ఎదుర్కొంటారని తెలిపింది. అయితే, కొత్తగా వ‌చ్చిన న‌టులు ఆ పరిణామాలను ఎదుర్కోవడంలో ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉంటున్నారని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News