: శశికళ వర్గంలో ముసలం మొదలు... ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పదవికి పాండ్యన్ రాజీనామా
శశికళ బెంగళూరు బయలుదేరగానే, అన్నాడీఎంకే పార్టీలో ముసలం పుట్టింది . పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు పాండ్యన్ ప్రకటించారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ను నియమించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పాండ్యన్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జయలలిత పక్కన బెట్టి, పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ ను తిరిగి ఎలా తీసుకు వస్తారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. మరికాసేపట్లో ఆయన పన్నీర్ సెల్వంను కలిసి మద్దతు ప్రకటిస్తారని సమాచారం.