: మార్కెట్లోకి రాకుండానే ఆన్ లైన్లో ప్రత్యక్షమైన నోకియా 6 స్మార్ట్ ఫోన్


ఇంకా భారత మార్కెట్లో విడుదల కూడా కాకుండానే, నోకియా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 'నోకియా 6' ఫోన్లు ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ-కామర్స్ సంస్థ ఈబేలో ఈ ఫోన్లు రూ. 32,440కి లభిస్తున్నాయి. అయితే, చైనాలో మాత్రం ఇవి రూ. 17 వేలుకే దొరుకుతున్నాయి. 25 రోజుల్లో ఫోన్ డెలివరీ అవుతుందని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్ ఉండటం, ఆక్టాకోర్ ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ కాగా, నోకియాకున్న బ్రాండ్ పేరుతో ఈ ఫోన్ అమ్మకాలు భారీగా సాగుతాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ అధికారికంగా భారత మార్కెట్లో త్వరలో విడుదల కానుందని భారత్ లో నోకియా ఫోన్ల డీలర్ హెచ్ఎండీ గ్లోబల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News